– జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి
– జోనల్ కమిషనర్ స్నేహశబరిశ్
నవతెలంగాణ-మియాపూర్
బిల్డింగ్ భవన నిర్మాణ సామాగ్రిని బహిరంగ ప్రదేశాలు డంపింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోషనల్ కమిషనర్ స్నేహశబరిశ్ హెచ్చరించారు. మాదాపూర్ హైటెక్ సిటీ రైల్వే స్టే షన్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్నేహశబరిశ్, చందానగర్ డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, సిబ్బందితో కలిసి బహిరంగ ప్రదేశాలలో డంపింగ్ చేస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లా డుతూ భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉం టాయని హెచ్చరించారు. భవన నిర్మాణ వ్యర్థాలను పడేయడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. వాటిని ట్రాక్టర్, ట్రాక్ యజమానులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కార్తీక్, జీహెచ్ ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.