ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

– హుస్నాబాద్ సిఐ ఎర్రల్ల కిరణ్ 

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హుస్నాబాద్ సిఐ ఎర్రల్ల కిరణ్ అన్నారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా నిబంధనలకు విరుద్ధంగా నిలిపిన వాహనాలపై జరిమానా విధించారు. షాపుల ఎదుట వాహనాలను నిలుపేటప్పుడు యజమానులు వాహన దారులకు సూచించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తోట మహేష్ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.