ధాన్యం కాంతులు నిలిపివేస్తే చర్యలు

– తూకంలో పొరపాటు వస్తే కేసులు 
– జిల్లా డిఎస్ఓ మల్లికార్జున్ బాబు    
నవతెలంగాణ – నసురుల్లాబాద్
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జరుగుతున్న జాప్యంతో రైతులు అవస్థలు పడుతున్నారంటూ శనివారం బీర్కూర్ ఆందోళన చేపట్టడంతో ఆదివారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు బీర్కూర్ సహకార సంఘం కార్యాలయంలో విచారణ చేపట్టారు. కేంద్రాలను సత్వరం ప్రారంభించాలని ఈమేరకు అధికారులను ఆదేశించారు. అలాగే సిద్ధి వినాయక రైస్ మిల్లులో ధాన్యం కొలతలపై విచారణ చేపట్టారు.  సహకార సంఘం వారు కొనుగోలు చేసిన ధాన్యం సిద్ధి వినాయక రైస్ మిల్లులో ధాన్యం తరుగు వస్తుందని రైతులు తహసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. దీనితో జిల్లా పౌరసరపరాధికారి,  కొలతల అధికారి సిద్ధి వినాయక రైస్ మిల్లులో విచారణ చేపట్టారు. బరంగెడ్గి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు.  గోనెసంచులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. తేమ శాతం 17 శాతం కంటే తక్కువగా ఉంటే పొలాలకు వెళ్లి అక్కడే అన్నదాతలకు టోకెన్లు జారీ చేయాలని వ్యవసాయ విస్తరణాధికారులను ఆదేశించారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి కనీస మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు మించి వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అలాగే ధాన్యం కొలతల్లో పొరపాటు జరుగుతే సహించేది లేదని డీఎస్ఓ అధికారి మల్లికార్జున్ బాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ డిటి ఇన్ఫోర్స్మెంట్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.