
నవతెలంగాణ – అశ్వారావుపేట
అనుమతులు లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ ఒ డా. సుకృత పలు ప్రైవేట్ వైద్యులను హెచ్చరించారు.రోగుల పట్ల వైద్యులు సానుకూలంగా ఉండాలని సూచించారు.అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఆమె పలు ప్రయివేట్ ఆసుపత్రులు,రక్త పరీక్షలు కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు.ల్యాబ్ లు, ఆసుపత్రుల నిర్వహణ పై వైద్యులు, టెక్నీషియన్ లకు పలు సూచనలు చేవారు.స్కానింగ్ సెంటర్ల లో నిబంధనల ప్రకారం అన్ని వసతులు,అనుమతులు, అర్హతలు ఎంత వరకు ఉన్నాయో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.అర్హత దృవీకరణ పత్రాలను తనిఖీ చేశారు.అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆసుపత్రులు,ల్యాబ్ ల్లో అన్ని మౌళిక సదుపాయాలు ఉండాల్సిందేనని,లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.ఆమె వెంట జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ ఫైజ్ మొహిద్దీన్, డిప్యూటీ ఎస్.ఒ వై.ఇనాక్, హెల్త్ ఎడ్యుకేటర్ పి. బేబీ తదితరులు ఉన్నారు.