– నిబంధనలు ఉల్లంఘిస్తే.. భూములు తిరిగి తీసుకుంటాం
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి
– బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు ఆదేశం
– కందుకూరు మండల చివరి సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-కందుకూరు
అసైన్ ల్యాండ్ భూములలో మట్టి తవ్వకాలు జరిపితే, ఇచ్చిన భూమి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. వ్యవసాయం చేసుకొని కుటుంబాన్ని పోషించాలని ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్ ఇస్తే, మట్టి తవ్వకాలు జరుపుతారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మంద జ్యోతి పాండు అధ్యక్షతన కందుకూరు మండల పరిషత్ కార్యాల యంలో శనివారం నిర్వహించారు. ఈ నెల 31 తేదీతో సర్పంచుల పదవీకాలం ముగియనుం డడంతో ఇదే చివరి సమావేశం. కాగా ఈ సమావే శానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. అసైన్డ్ భూములలో మట్టి తవ్వకాలు జరిపిన వారికి నోటీసులు ఇవ్వాలని కందుకూరు తహసీల్దార్ గోపా ల్‌కు ఆదేశాలు ఇచ్చారు. మట్టి అమ్ముకున్న వారు, మట్టి పోసి వ్యవసాయం చేస్తారా అని ప్రశ్నించారు. కందుకూరు మండలంలో ఏఏ గ్రామాలలో అసైన్డ్ భూములలో మట్టి తవ్వకాలు జరిగావో వివరాలు సేకరించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అదేవి ధంగా మట్టి లారీలను సీజ్ చేయాలన్నారు. నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
పలు ఆంశాలపై చర్చ
ఎక్సైజ్ అధికారి సమావేశంలో మాట్లాడుతుం డగా సభ్యులందరూ అభ్యంతర వ్యక్తం చేశారు. గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తు న్నారని, వారిపై చర్యలు ఎందుకు తీసుకుంటా.. లేరా అని సభ్యులు నిలదీశారు. ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపు నిర్వాహకుల నుండి లంచాలు తీసుకొని తమకు ఏమి తెలియదన్నట్టు నటిస్తున్నారని ఆరో పించారు. కందుకూరు గ్రామంలో ఒక యువకుడు మద్యానికి బానిసై మృతిచెందినట్టు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపు నిర్వాహకులపై ఖఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపు నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
సర్పంచ్‌లకు అభినందనలు :
గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సర్పంచ్‌లకు సభ అభినందనలు తెలిపింది. సర్పం చ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, అధికారులు అందరూ కలిసి సమన్వయంతో గ్రామాలను అభి వృద్ధి చేశామన్నారు. ‘మన ఊరు-మన బడి’ లో భాగంగా నేదునూరు మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్, మిర్‌ఖాన్‌పేట గ్రామంలో అమెజాన్ సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేసినట్టు తెలిపారు.
చెరువుకుంటలను కాపాడాలి :
ఇరిగేషన్‌పై సంబంధిత అధికారి మాట్లాడు తుండగా ఎమ్మెల్యే జోక్యం చేసుకుని మాట్లాడారు.. చెరుకుంటలను కాపాడాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధి కారులతో పాటు గ్రామంలోని అందరిపై ఉందన్నా రు. చెరువు శిఖంలలో ఎఫ్డిఎల్ పరిధిలో మట్టి తీస్తే, కేసులు నమోదు చేయాలని హెచ్చరించారు.
సర్పంచ్‌ల పెండింగ్ బిల్లుల కోసం కృషి :
గ్రామాల్లో సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రా మపంచాయతీలలో నిధులు జమ ఉంటే పంచాయ తీ తీర్మానం చేసుకొని బిల్లులు పెట్టి తీసుకోవడానికి అవకాశముందన్నారు. ఆ దిశగా కృషి చేయా లన్నారు.
అంగన్‌వాడీల ఆప్‌గ్రేడ్‌కు కృషి చేయాలి :
అంగన్‌వాడీల అప్‌గ్రేడ్‌కు కృషి చేయాలని కోరారు. సర్పంచ్‌ల పదవి కాలం ముగియనుండ డంతో ఎన్నికలు అయ్యే వరకు ఇప్పుడు ఉన్న వారికే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్నారు. ఆ రకంగా బిల్లులు సమకూర్చుకోవచ్చని సర్పంచ్‌లు ఆశాభవం వ్యక్తం చేశారు. ఎంపీపీ మందా జ్యోతి, జడ్పీటీసీ, సహకార సంఘం చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ అభివృద్ధికి ఎంతో సహకరించారని అన్నారు. భవిష్యత్‌లో ఇలాగే కొనసాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్‌రెడ్డి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు దేవరశెట్టి చంద్రశేఖర్, సహకార సంఘం వైస్ చైర్మన్ విజేందర్‌రెడ్డి, తహసీల్దార్ గోపాల్, ఎంపీడీవో వెంకట్‌రాములు, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీ సీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.