వీవోఏలపై కక్ష సాధింపు చర్యలు ఆపాలి

– సీఐటీయూ జిల్లా నాయకుడు దుంపల రంజిత్‌ కుమార్‌
నవతెలంగాణ-దండేపల్లి
వీవోఏలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపాలని సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షుడు దుంపల రంజిత్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం నిరసన కార్యక్రమాల్లో భాగంగా అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఐకెపి వివోఎలకు మద్దతుగా సిఐటియు పోరాటం చేస్తోందన్నారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న వారిపై అక్రమ అరెస్టులు చేయడంతో పాటు మహిళల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 29న సెర్ప్‌ ఆఫీసు ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగంపల్లి వెంకటేష్‌, పోషం, అన్వర్‌, అనిత, మండల కమిటీ సభ్యులు శ్రీనివాస్‌, సత్తన్న, నీరజ, సంధ్య, హేమలత, విజయ, రాజేశ్వరి, సుస్మిత, సునీత, హసీనా, లావణ్య పాల్గొన్నారు.