దివిస్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

Actions should be taken against the ownership of Divis companyనవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ లోని దివిస్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకొని బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు.బుధవారం చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన బాధిత రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కె.హనుమంతు జెండగే కు వినతిపత్రం సమర్పించి దివిస్ కంపెనీ వల్ల రైతులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. అనంతరం కాళీ బాటిల్లతో కలక్టరేట్ ప్రాంగణంలో రైతులు నీళ్లును చూపించారు. వ్యర్థ రసాయనాలతో వస్తున్న బోర్ నీళ్లను వాటర్ బాటిల్స్ తో  కు చూపించారు. క్ేత్రస్థాయిలో పరిశీలనకు రావాలని కలెక్టర్ ను కోరగా కలెక్టర్ స్పందించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎండి జహంగీర్ మాట్లాడుతూ ప్రతి ఏటా లక్షల రూపాయలు విలువ చేసే పంటలను, పశుసంపదను నష్టపోతున్నారని అన్నారు.దివిస్ కంపెనీ ఆవరణలోనే బోర్ వెల్స్ ద్వారా సుమారు150 బోర్లను వందలాది ఫీట్ల లోతు వేయించి వాటిల్లో కంపెనీ నుండి వెలువడే వ్యర్థ రసాయనాలను పంపడంతో కంపెనీ చుట్టూతా ఉన్న భూముల్లోని భూగర్భ జలాలు మొత్తం కలుషితమై పంట నష్టం, ప్రాణ నష్టానికి కారణం అవుతున్నారని అన్నారు. వేసిన పంటలు వ్యర్ధ రసాయనాల వల్ల మాడి మసైపోతున్నాయని అన్నారు. పశువులు ఈ నీళ్లను తాగడం వల్ల చనిపోతున్నాయని అన్నారు. పశువులకు నీళ్లు తాపడానికి రైతులు ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసి తాపుతున్నారన్నారు. ఈ కంపెనీ వెదజల్లే విషవాయువులను, వ్యర్థ  రసాయనాలను ఆపడానికి సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు.పంటలు,పశు పోషణ కరువై రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు.బాధిత రైతులకు ఒక ఎకరానికి 50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన సిపిఎం ఉధృతమైన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బాధిత రైతులు సామ జనార్దన్ రెడ్డి, గుండెబోయిన బాలకృష్ణ, అనంతుల రాములు,శ్రీరాముల బక్కయ్య,జిల్లల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.