దళితుల పై వివక్షత చూపిన అగ్రవర్ణాలపై తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న రోజులలో ప్రజలంతా కులాలు మతాలు మరిచిపోయి అంత సమానంగా బతుకుతున్న తరుణంలో ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని మిడతనపల్లి గ్రామంలో అగ్రవర్ణాలు దళిత మహిళలపై బతుకమ్మలు ఆడకుండా నిషేధించడం మాట్లాడుతామని పేరుతో పిలిచి వారిపై వివక్ష కు పాల్పడి అవమానించిన అగ్రకులాల వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు . దళిత బాధితులకు న్యాయం జరిగేలా కోరుతూ దళితులపై వివక్ష చూపే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.