రోడ్డు కట్ కాకుండా చర్యలు తీసుకోవాలి..

– జలగలంచ బ్రిడ్జిని పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి 
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని 163 వ జాతీయ రహదారి జలగలంచ వద్ద మంగళవారం ములుగు జిల్లా నూతన కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించి, పరిశీలించారు. రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు జనగలంచ రోడ్డు గతంలో వలె తెగిపోయే ప్రమాదం జరగకుండా చూసుకోవాలని స్థానిక తాసిల్దార్ ముల్కనూరు శ్రీనివాస్ తో కలిసి నేషనల్ హైవే ఈ గారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ గతంలో జనరల్ నుంచి బిజీ తెగిపోయి రాకపోకలు ఇబ్బందులు జరిగాయని, అలా జరగకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాబోయే రెండు రోజుల్లో వర్షాలు అధికంగా ఉన్నాయని అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారుల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆమె వెంట స్థానిక శాసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్, ఆర్ఐ సాంబయ్య, సిబ్బంది తదితరులు ఉన్నారు.