సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి: డీఎల్ పీఓ 

Steps should be taken to prevent seasonal diseases from spreading: DLPOనవతెలంగాణ – మల్హర్ రావు
వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని భూపాలపల్లి డిఎల్పీఓ వీర బద్రయ్య పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.గురువారం మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామంలో పలు వార్డుల్లోని మురికాల్వల్లో పారిశుధ్యాన్ని పరిశీలించారు.డ్రైనేజీలు,రోడ్లపై చెత్త, చెదారం ఎప్పటికప్పుడు తొలగిస్తూ, ఖాళీ స్థలాల్లో మురుగు నీరు నిల్వలుగా లేకుండా చూడాలన్నారు.ఈగలు,దోమలు లేకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నారు.పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెన్నెల,సిబ్బంది పాల్గొన్నారు.