నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి

charset=InvalidCharsetId

నవతెలంగాణ – భిక్కనూర్
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వీడియో కాన్ఫరెన్స్ లో మండల అధికారులకు తెలిపారు. మంగళవారం రెవెన్యూ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం నుండి విసి ద్వారా సమావేశం నిర్వహించారు. పీఎం విశ్వకర్మ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎంపీడీవో కార్యాలయాలలో ఏర్పాటుచేసిన ప్రజా పాలన కేంద్రాలలో దరఖాస్తులను స్వీకరించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గ్రామాలలో నీటి ఎద్దడి లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శివప్రసాద్, ఎంపీడీవో సంతోష్ రెడ్డి, ఎంపీ ఓ ప్రవీణ్ కుమార్, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.