నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మాదాపూర్ జీపీ లో గ్రామ ప్రజలకు ఎండకాలంలో నీటీ ఎద్దడి నివారించేందుకు జీపీ కార్యదర్శి గోపాల్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ జల్దేవార్ దినేష్ సహకారంతో నూతనంగా బోరుబావి వేసిన దానీలో ఎంపిటిసి నిధులతో మేాటారును బిగించి నీటి సమస్యను పరిష్కరించడం జరిగింది. గ్రామ పంచాయతి కార్యదర్శి గ్రామ ప్రత్యేక అధికారీ గోపాల్ తెలిపారు. ఈ సంధర్భంగా జీపీ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతు ఎంపిటీసి నిధులు 1లక్ష 25వేల రూపాయల వ్యయంతో బోరు, మేాటారు ఏర్పాటు చేసారని, గ్రామములో ప్రజా సమస్యలను ఎప్పడికప్పుడు తన దృష్టికి వచ్చినవి పరిష్కరించడం , గ్రామ పరిశుభ్రతతో పాటు ఇతర కార్యక్రమాలైన హరితహరం, నర్సరీ, డంపింగ్ యార్జు, త్రాగు నీరు , ప్రభూత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేవిధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శీ గోపాల్, మాజీ సర్పంచ్ జే.దినేష్, గ్రామపార్టీ బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గోన్నారు.