అధిక లోడుతో వాహనాలు నడిపితే చర్యలు

– అధిక లోడు ట్యాంకర్లను పట్టుకున్న ఎస్సై విఠల్‌రెడ్డి
– జరిమానా విధించిన ఆర్టిఏ అధికారి శ్రీలక్ష్మి
నవతెలంగాణ-తాండూరు రూరల్‌
పరిమితికి మించి వాహనాల్లో లోడ్‌ తీసుకెళ్తే, చట్టపరమైన చర్యలు తప్పవని కరణ్‌కోట ఎస్‌ఐ విఠల్‌రెడ్డి అన్నారు. వాహనాల తనిఖీలో భాగంగా 8 వాహనాలు అధిక లోడుతో వెళ్తున్న ట్యాంకర్లను ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీ చేసి వాటిని స్వాధీనం చేసుకుని, ఆర్టీఏ అధికారి శ్రీలక్ష్మికి అప్పగించారు. అధిక లోడుతో ఉన్న వాహనాలకు, ఒక టన్నుకు రూ. 2 వేల చొప్పున జరిమానా విధించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ అధిక లోడుతో రోడ్లన్నీ గుంతల మయంగా తయారవుతున్నాయని దీంతో రోడ్ల గుండా తిరిగే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పరిమితికి మించి లోడు తీసుకపోవద్దని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధిక లోడుతో మూడుసార్లకంటే పట్టుబడితే అలాంటి వాహనాలను సీజ్‌ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.