– సెక్రెటరీ తిరుపతయ్య
– చికెన్, మటన్ షాప్ యజమానులకు నోటీసులు జారీ
– వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయొద్దు
– నిబంధనల ప్రకారం నడుచుకోవాలి
నవతెలంగాణ-యాచారం
చికెన్, మటన్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడేస్తే చర్యలు తప్పవని షాపు ల యజమానులకు పంచాయతీ సెక్రెటరీ తిరుపతయ్య హెచ్చరించారు. ఆది వారం యాచారం సెంటర్‌లో ఉన్న మటన్, చికెన్ షాపులో యజమానులకు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాంస వ్య ర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయడంతో కుక్కలు తిని పిచ్చి పిచ్చిగా జనాలపై దాడులు చేస్తున్నాయని తెలిపారు. షాపులో యజమానులు మాంస వ్యర్ధాలను గుంతలు తీసి వేసి పూడ్చాలని కోరారు. వ్యర్థాలను రోడ్ల పైన వేస్తే కఠిన చర్య లు ఉంటాయని హెచ్చరించారు. చికెన్, మటన్ షాపుల యజమానులు నిబం ధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. పిచ్చికుక్కల పట్ల ప్రజలు అప్ర మత్తంగా ఉండి చిన్నపిల్లలపై దాడి చేయకుండా కాపాడుకోవాలని సెక్రటరీ అన్నారు. ఈ కార్యక్రమంలో కారోబార్ శరణం, తదితరులు పాల్గొన్నారు.