నవతెలంగాణ-మల్హర్ రావు : రానున్న వేసవిలో మండలంలోని గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లుగా మిషన్ భగీరథ,ఆర్ డబ్ల్యూఎస్ డిఈ రమేష్,ఏఈ హరిత తెలిపారు.తాగునీటిపై భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఈనెల 1 నుంచి పది రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహించాలనే ఆదేశాలతో మిషన్ భగీరథ అధికారులు మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో సందర్షించారు.ఈ సందర్భంగా గ్రామంలో నిరుపయోగంగా ఉన్న బోర్లు,చేతి పంపులు,ట్యాoక్ లు,పైప్ లైన్ లీకేజీల,కొత్త పైప్ లైన్లు, గెట్ వాల్ లీకేజీల తదితరవి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జీపీ,మిషన్ భగీరథ సిబ్బంది పాల్గొన్నారు.