సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన కార్యదర్శులపై చర్యలు తప్పవు

– ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్..

నవతెలంగాణ – రెంజల్ 
గ్రామాలలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన కార్యదర్శులపై చర్యలు తప్పవని ఎంపీడీవో హెచ్ శ్రీనివాస్, ఎంపీఓ గౌస్ ఉద్దీన్లు స్పష్టం చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీడీవో చాంబర్లో కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండడం, క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లించడం, తదితర అంశాలపై కార్యదర్శులకు సూచనలు ఇచ్చారు. ప్రతి గ్రామంలో తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పౌడర్ వేసి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ గ్రామ కార్యదర్శులు శ్రీకాంత్, నవీన్, రాజు, వెంకటరమణ, సాయిబాబా సతీష్ చంద్ర, బి. రాణి, గౌతమి, అమ్రీన్ తదితరులుపాల్గొన్నారు.