చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు: సీ ఐ శంకర్

నవతెలంగాణ – గోవిందరావుపేట
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పస్రా సీ ఐ శంకర్ అన్నారు. బుధవారం మండలంలోని పందిరి దొన గుత్తి కోయ గ్రామాన్ని కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సిబ్బందితో కలిసి సీ ఐ శంకర్ సందర్శించారు. ఈ సందర్బంగా ఎస్ ఐ కమలాకర్ మాట్లాడుతూ  మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదు అని, అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించకుండ ఎవరైనా కొత్త వ్యక్తులు తమ గ్రామం కు  వస్తే తమకు సమాచారం అందించాలని తెలియచేసారు. చట్ట వ్యతిరేక మైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అక్కడి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత మేరకు వాటిని తిరుస్తామని హామీ ఇవ్వటం జరిగింది.