
– హుస్నాబాద్ ఎక్సైజ్ సీ ఐ పవన్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ ఎక్సైజ్ పరిధిలో బెల్లం అక్రమంగా గుడుంబా తయారుదారులకు అమ్మితే, చట్టపరమైన చర్యలు దెబ్బ అని హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్ హెచ్చరించారు. మంగళవారం హుస్నాబాద్ కు చెందిన పవన్ కుమార్ అను వ్యాపారి పై జనగాం పరిధిలో కేసు నమోద్ కాగా హుస్నాబాద్ తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ పవన్ మాట్లాడుతూ దుకాణదారులు బెల్లం ను గుడుంబా తయారీదారులకు అమ్మకుడదని, నిబంధనలు అతిక్రమిస్తే గుడుంబా తయారీదారులతో పాటు బెల్లం వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేస్తామని సీ ఐ పవన్ హెచ్చరించారు . వ్యాపారులు మేడారం జాతర భక్తులకై అమ్మే బెల్లం క్రయ విక్రయాల రోజు వారీ వివరాలు స్టేషన్ కు అందజేయాలని నోటీసులు ఇచ్చామని తెలిపారు.