స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు 

– జిల్లా అదనపు  కలెక్టర్ పైజన్ అహ్మద్ 
నవతెలంగాణ – కుభీర్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ ధనం.పచ్చదనం కార్యక్రమంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా అదనపు  కలెక్టర్ పైజన్ అహ్మద్ అధికారులకు హెచ్చరించారు. గురువారం  కుభీర్ మండలంలోని వీరేగాం  గ్రామ పంచాయతీ ని  సందర్శించారు. ఈసందర్భంగా గ్రామంలో స్మశాన వాటిక, నర్సరీ, కశెగ్రిగేషన్ షెడ్ లను  పరిశీలించారు. ప్రతిరోజు గ్రామంలో శానిటేషన్ పనులు  జరుగుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీని సందర్శించిన పుస్తకాలనుబ్  ప్రత్యేక అధికారి సంతకాలు  లేకపోవడంపై  పంచాయితి కార్యదర్శి పై అగ్రం వ్యక్తం చేశారు.  ప్రత్యేక ప్ అధికారులు  తప్పకుండా స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు   తప్పకుండా పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలతో పాటు తండాలలో అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.దింతో గ్రామ పంచాయతీ కి సంబందించిన పలు రికార్డులను పరిశీలించి పలు సూచనలు సలహాలు అందించారు .ఆయన వెంట  ఎంపీడీవో మోహన్ సింగ్, ఏపీవో హరిలాల్, పంచాయతి కార్యదర్శి సూర్య ,వివిధ గ్రామాల కార్యదర్శిలు ఉపాధిహామీ టెక్నికల్ అస్టెంట్ మహేష్ పిల్డ్ అస్టెంట్ శేషరావు  తదితరులు పాల్గొన్నారు.