– జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చెక్‌పోస్ట్ వద్ద నిరంతరం నిఘా ఉంచాలి
నవతెలంగాణ-తాండూరురూరల్
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం. తాం డూరు మండలం కొత్లాపూర్ గ్రామ సమీపంలోని చెక్ పోస్టును జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, ఆర్డీవో శ్రీనివా సరావు, తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్‌తో కలిసి పర్య వేక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నిరంతరం నిఘా ఉంచి వచ్చిన ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఇప్పటివరకు చెక్‌పోస్ట్ వద్దా ఎన్ని డబ్బులు పట్టు పడ్డాయని, కరణ్‌కోట ఎస్‌ఐకి అడగగా రూ.లక్షలు డిపాజిట్ చేశారన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కర్ణాటక నుంచి వచ్చే ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాలి ప్రతి వాహనం సీసీ కెమెరాలో రికా ర్డు అయ్యేటట్టు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉం చాలని చెక్‌పోస్ట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలు కమిషనర్ కార్యాలయానికి అనుసంధానం ఉంటుందన్నారు. బాధ్యతయుతంగా విధులు నిర్వహించకపోతే ఎన్ని కల నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుం టామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, రూరల్ సీఐ రాంబాబు, ఎస్సై మధుసూదన్‌రెడ్డి, డీఏఓ మహేష్ గౌడ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజిరెడ్డి ఉన్నారు.