నిబంధనల అతిక్రమిస్తే చర్యలు తప్పవు 

నవతెలంగాణ-మంథని: మంథని మున్సిపల్ పురపాలక పరిధిలోని పాడి పశువుల యజమానులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి హెచ్చరించారు. సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ మంథని మున్సిపల్ పరిధిలోని ఆవులు గేదల యజమానులు రోడ్లపైన జంతువులను వదిలిపెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా పట్టణంలోని పలు ప్రాంతాలు జంతువుల వ్యర్థ పదార్థాల వల్ల అపరిశుభ్రత చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికైనా జంతువుల యజమానులు స్పందించి తమ వంతు బాధ్యతగా తమకు సంబంధించిన వాడి పశువులను తమ ఆవరణలో నిలుపుకోవాలని సూచించారు.లేనిచో ఈ నెల 30 తర్వాత నుండి పట్టణానికి దూరంగా తరలించబడతాయని ఆమె వివరించారు.