నిరాధారమైన నగదు, వస్తువులు తరలిస్తే చర్యలు తప్పవు

– 25 తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్న ఎస్సై తిరుపతి
నవతెలంగాణ – కోహెడ
నిరాధారమైన నగదు, వస్తువులు తరలిస్తే చర్యలు తప్పవని ఎస్సై సిహెచ్‌.తిరుపతి అన్నారు. శనివారం మండలంలోని బస్వాపూర్‌ గ్రామ పరిధిలో వాహనాలను తనీఖీ చేస్తున్న క్రమంలో కరీంనగర్‌ నుండి అక్కన్నపేటకు వెళ్తున్న కారులో అక్కన్నపేట గ్రామానికి చెందిన తిప్పాని శ్రీహరి ఎలాంటి ఆధారాలు లేని 25 తులాల బంగారు గొలుసును తరలిస్తున్న క్రమంలో ఎస్సై తిరుపతి పట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 25 తులాల బంగారు గొలుసు సుమారు 16 లక్షల 25 వేల విలువైనదిగా గుర్తించినట్లు తెలిపారు. అలాగే సీపీ ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం నిరాధారమైన వస్తువులు తరలించినట్లయితే చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట కానిస్టేబుల్‌లు ఖాన్‌, తదితరులు ఉన్నారు.