నవతెలంగాణ- కౌడిపల్లి
ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని ఎంఈఓ బాల్ రాజ్ నాయక్ పేర్కొన్నారు. బుధవారం ఎంఈఓ గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని అన్నారు. బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలించేందుకు ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండే విధంగా చూడాలని ఆయన సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాలు బోధించాలని తెలిపారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎంఈఓ ను వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు శాలువాతో సన్మానించారు