ఉద్యమకారుల ఫోరం రాష్ట్రస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలి

నవతెలంగాణ – మల్హర్‌రావు
ఈనెల మార్చి 11 న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  టియూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ ఉద్యమ కారుల సభను తెలంగాణ ఉద్యమ కారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని (టియూఎఫ్) తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలోజు సత్యనారాయణ, రాష్ట్ర ప్రఛార కార్యదర్శి, మండల అధ్యక్షులు ముడితనపెల్లి ప్రభాకర్ లు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని తాడిచర్ల లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు  తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించడం పట్ల టియూఎఫ్ ఫోరం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అక్రమ కేసులు, బైండోవర్సే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి గుర్తించి ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయిన ఉద్యమ కారులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో జయశంకర్ జిల్లా ఉపాధ్యక్షులు బోయిని రాజయ్య యాదవ్, మండల ప్రదాన కార్యదర్శి బూడిద సతీష్, తెలంగాణ ఉద్యమ కారులు చొప్పరి రాజు, షేక్ చాంద్ పాషా, తోకల గణేష్, మీనుగు నాగేష్, కోంఢ్ర సారయ్య, ముద్రవేణి కిష్టయ్య, బండారి యశోద, బండారి శంకరయ్య. ఊట్నూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.