తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఉద్యమకారులు ఆదివారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల సంగం మండల అధ్యక్షుడు మేడిదుల వెంకన్న మాట్లాడుతూ.. నేటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమై పోరాడిన తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో స్పష్టమైన ప్రకటన చేస్తూ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఉద్యమకారునికి 250 గజాల స్థలము గౌరవ పెన్షన్ ఇతర హామీలు నెరవేర్చాలని దీనికి మంత్రి సీతక్క చరవ చూపించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉద్యమకారులు డాక్టర్ ప్లీజ్. హేమాద్రి , ఉద్యమకారుల జిల్లా నాయకులు అజ్మీరా సురేష్, జిల్లా మహిళ అధ్యక్షులు బత్తుల రాణి, గ్రామ అధ్యక్షులు అకినాపెళ్ళి రమేష్, లకావత్ చండూలాల్, కార్యదర్శి కొండి రమేష్, సంయుక్త కార్యదర్శి,బానోత్ గోపి చందు,మీడియా కన్వీనర్ కొండా రమేష్,మండల సలహా దారుడు, రేండ్ల శ్రీను తదితరులు పాల్గొనడం జరిగింది.