కార్యకర్తలు ప్రజా సమస్యలు గుర్తించాలి

– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్

నవతెలంగాణ రెంజల్
రెంజల్ మండలంలో కార్యకర్తలందరూ ఒకే తాటిపై ఉంటూ ప్రజా సమస్యలపై స్పందించాలని, గ్రూపు రాజకీయాలు చేయకూడదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని దూపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కార్యకర్తలు ప్రజా సమస్యలను గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, ఇలాంటి మనస్పర్ధలకు తావివ్వకుండా ప్రజా సమస్యలను పరిష్కరించే దిశలో వెళ్లాలని ఆయన సూచించారు. మండల అభివృద్ధి కోసం మాజీ మత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సహాయ సహకారాలతో ముందుకు సాగాలని ఆయన అన్నారు. పార్టీలకతీతంగా ప్రజా సమస్యలపై స్పందించాలని ఆయన ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు జి.సాయిరెడ్డి, సిహెచ్ రాములు, ధనుంజయ్, జావిద్ ఉద్దీన్, ఎమ్మెల్ రాజు, రవి, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లు అంజయ్య, కురుమే శ్రీనివాస్, మాజీ సర్పంచులు బాబన్న, గణేష్ జాదవ్, వెల్మల నరసయ్య, బి, రవి, భన్సియా నాయక్, షౌకత్ అలీ, అంజాద్, సోనారి గంగాధర్, ఉబేద్, లక్ష్మారెడ్డి, ప్రభాకర్ వెంకటి, కార్తీకి యాదవ్, గైనికిరణ్, శంషాద్దీన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.