బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలి

నవతెలంగాణ – రాయపర్తి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బిఆర్ఎస్ పార్టీ గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మండలంలోని తిర్మలాయపల్లి, మైలారం, గన్నారం, రాయపర్తి గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపుకు కార్యకర్తలకు దిశానిర్దేశం చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే బిఆర్ఎస్ పార్టీతో సాధ్యమన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుధీర్ కుమార్ మచ్చలేని నాయకుడని ఉన్నత విద్యావంతుడని తెలిపారు. తెలంగాణ మలి దశ ఉద్యమం నుండి పార్టీ కోసం పనిచేసిన నాయకుడని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల అభ్యర్థులు పదవుల కోసం పార్టీలు మారి నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారని దుయ్యబట్టారు. నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్, బిజెపి పార్టీల అభ్యర్థులకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ జెండా విజయకేతనం ఎగరవేయడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహ నాయక్, జిల్లా నాయకుడు బిర్లా సుధీర్ రెడ్డి, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పిటిసి రంగు కుమార్, రైతుబంధు కోఆర్డినేటర్ సురేందర్ రావు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఎండి నాయిమ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గారె నర్సయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షుడు కాశీనాథం, వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యకర్తల పాల్గొన్నారు.