ఎన్నికల్లో మల్లురవి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి: మంత్రి జూపల్లి

– గువ్వల్లోనిపల్లి లో కోలాటాల బృందం ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
నవతెలంగాణ – ఉప్పునుంతల
అచ్చంపేట నియోజకవర్గ ఉప్పునుంతల మండలంలోని గురువారం పెనిమెళ్ళ, గువ్వలోనిపల్లి, లత్తిపూర్, ఈరాట్వానిపల్లి, వెల్టూరు, అయ్యవారిపల్లి, పిరాట్వానిపల్లి,రాయిచెడ్, కొరటికల్, తిప్పాపూర్ గ్రామాల్లో విస్తృత ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి వర్యులు కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణా రావు,డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో మల్లురవి గెలుపే లక్ష్యంగా ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి వెళ్లి  ప్రచారం చెయ్యాలని  ఎమ్మెల్యే వంశీకృష్ణ సూచించారు. బీజేపీ, బిఆర్ఎస్ ప్రభుత్వాలకు ఓటు వేస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తారని అదేవిధంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు అభివృద్ధి ఒరిగింది ఏమిలేదని గుర్తు చేశారు.కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాని గా చేయాలని ఏకైక లక్ష్యంతో నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి గెలుపు తోనే రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు ఈ యొక్క అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి కి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఎఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక మేనిఫెస్టో ఐదు న్యాయ అంశాలు, తెలంగాణ ప్రభుత్వం ఆరుగ్యారంటీల పథకాలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో నాయకులు కార్యకర్తలు విశితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘాలు, ప్రజలు పాల్గొన్నారు.