తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రమైన తాడిచర్లలోని సుంకరిపల్లె కౌoటర్ కేంద్రంలో తెలంగాణ ఉద్యమ కారులు పోలోజు సత్యనారాయణ, ముడితనపెల్లి ప్రభాకర్, చొప్పరి రాజేందర్, షేక్ చాంద్ పాషా, సమ్మయ్య, ఆకుల సదానందం, ముద్రవేణి కిష్టయ్య, గుంటుకు వసంతలు దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫేస్టోలో ప్రవేశ పెట్టిన ఉద్యమ కారుల 250 గజాల ఇంటి స్థలం పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలిపారు.తెలంగాణ ఉద్యమ కారులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మానిఫేస్టోలో పొందుపర్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ఉద్యమ కారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.