పలు వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన నటుడు విజయ్ గంగరాజు కన్నుమూశారు. వారం రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో గాయపడిన ఆయన్ని హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన సోమవారం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. మోహన్‌లాల్ నటించిన ‘వియత్నాం కాలనీ’ మలయాళ సినిమాలో సినీ రంగ ప్రవేశం చేశారు విజయ్ గంగరాజు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో ఆయనకు తమిళంతోపాటు తెలుగులోనూ అవకాశా లొచ్చాయి. ‘భైరవద్వీపం’లో చేసిన విలన్ పాత్ర ఆయనకు తెలుగునాట మరింత మంచి గుర్తింపు తీసుకొచ్చింది. విజయ్ గంగరాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం తెలిపారు.