సన్‌ఫీస్ట్ మేరీ లైట్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా నటీ జ్యోతిక

నవతెలంగాణ – హైదరాబాద్: ITCలో భాగమైన Sunfeast Marie Light, వినియోగదారుల కోసం మరింత మెరుగైన రుచి, తాజా ప్యాకేజింగ్, మరియు ఆకర్షణీయమైన సరికొత్త ప్రణాళికతో మార్కెట్లో ఒక కొత్త అవతారంలోకి మార్పు చెందింది. Sunfeast Marie Light కొత్త ప్రచార కార్యక్రమం, బిస్కెట్ యొక్క కరకరలాడేదనం, రుచిని మాత్రమే హైలైట్ చేయడం కాకుండా, అంతర్లీనంగా ఒక భావోద్వేగపూరిత సందేశాన్ని కూడా ఇస్తుంది. జంటలు పటిష్టమైన జట్టుగా వ్యవహరించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. “లైట్ మూమెంట్స్ చేసేను స్ట్రాంగ్ టీమ్” అనే ట్యాగ్‌లైన్, భార్యాభర్తల మధ్య ఆహ్లాదకరమైన, సరదా క్షణాల ఆవశ్యకతను తెలియజేస్తుంది. వారి మధ్య పటిష్టమైన అనుబంధం ఏర్పడటంలో ఇవే అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. ‘స్ట్రాంగ్ టీమ్’ కాన్సెప్టును తీసుకుని, బ్రాండ్ ఇప్పుడు Sunfeast Marie Light ఉత్పత్తిని కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రతో పాటు భారతదేశంలోని పలు ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టింది. అంతేగాకుండా, ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ అయిన జ్యోతిక తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు Sunfeast Marie Light ప్రకటించింది. ఈ ఉత్తేజకరమైన భాగస్వామ్యం, Sunfeast Marie Lightను తిరిగి ఆవిష్కరించడాన్ని జ్యోతిక నటించిన తాజా, మనసుకు హత్తుకునే టీవీసీతో వేడుకగా జరుపుకుంటోంది. “స్ట్రాంగ్ టీమ్స్: బార్న్ ఫ్రం లైట్ మూమెంట్స్ బిట్వీన్ కపుల్స్” అనే ప్రచార కార్యక్రమంలోని ప్రధాన సందేశం, Sunfeast Marie Light బ్రాండ్ యొక్క ప్రణాళికను అత్యంత మనోహరంగా ఆవిష్కరిస్తుంది. మనందరి జీవితాల్లో, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే మనోజ్ఞమైన, సరళమైన ఆ క్షణాలను, పదిలపర్చుకోవాల్సిన ప్రాధాన్యతను చాటి చెప్పాలన్నది బ్రాండ్ ప్రధాన లక్ష్యం. ఇవే మనకెంతో ప్రియమైన వారితో బంధాలను పటిష్టపరుస్తాయి. సాధారణంగా ఉదయాన్నే టీ/కాఫీతో Marie Light బిస్కెట్లు ఆరగిస్తూ, భాగస్వాముల మధ్య అవగాహన, సాన్నిహిత్య భావనను పెంపొందించే సరదా సంభాషణలు సాగుతున్న వేళలో ఇలాంటి క్షణాలు ఆవిష్కృతమవుతాయి.
ITC Ltd. బిస్కెట్స్ & కేక్స్ క్లస్టర్, ఫుడ్స్ డివిజన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ అలీ హ్యారిస్ షేర్ ఈ భాగస్వామ్యంపై హర్షం వ్యక్తం చేశారు. “ప్రతి ఇంటా ఒక పటిష్టమైన జట్టును సృష్టించడంలో సహాయపడాలన్నది Sunfeast Marie Light లక్ష్యం. ఓ కప్పు టీతో Sunfeast Marie Light బిస్కెట్లు ఆరగిస్తూ, జంటలు ఒకరితో మరొకరు సమయాన్ని గడిపే సందర్భాల్లో ఇలాంటి సందర్భాలు ఆవిష్కృతమవుతాయి. ఆత్మావలోకనం చేసుకుని, తమ తమ అభిప్రాయాలను పంచుకుని, రోజువారీ జీవిత రేసు కోసం పునరుత్తేజం పొందేందుకు భార్యాభర్తలు కలిసికట్టుగా నిర్వహించే డగ్‌అవుట్ సందర్భంలాంటిది ఇది. అత్యంత ప్రతిభావంతురాలు మరియు ఎంతో పేరొందిన జ్యోతిక మా Sunfeast Marie Lightకి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుండటం మాకెంతో సంతోషం కలిగిస్తోంది” అని ఆయన తెలిపారు. Sunfeast Marie Light యొక్క కొత్త టీవీసీ మనస్సుకు హత్తుకుపోయే కథను ఆవిష్కరిస్తుంది. బంధాలను పటిష్టం చేసుకోవడంలో సరదా క్షణాల ప్రాధాన్యతను తెలియజేస్తుంది. మల్టీటాస్కింగ్ చేసే భార్యగా జ్యోతిక పాత్ర కనిపిస్తుంది. అనుకోకుండా వచ్చే అతిథులు, వారి పట్ల చూపించాల్సిన బాధ్యతలతో ప్రారంభంలో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అయితే, Sunfeast Marie Light బిస్కెట్ల నుంచి స్ఫూర్తి పొంది, ఆమె భర్త, ఆమెకు సహాయం చేసేందుకు రంగంలోకి దిగి, ఆమెకు ఓ బిస్కెట్ అందిస్తూ, దేన్నయినా తేలిగ్గా తీసుకోవాలనే విషయాన్ని గుర్తు చేయడంతో ఆ ఆందోళనంతా కరిగిపోతుంది. ప్రేమ, సహాయంతో కూడుకున్న ఈ చిన్నపాటి చర్య అక్కడి పరిస్థితిని మొత్తం మార్చేస్తుంది. తమ భాగస్వామ్య బంధం పటిష్టమైనదన్న విషయాన్ని జ్యోతిక చిరునవ్వుతో స్వీకరిస్తుంది. “జీవితంలో ఆందోళనలు తలెత్తినప్పుడు, తేలికపాటి క్షణాలు మనల్ని మనవారికి మరింత చేరువ చేస్తాయి. Sunfeast Marie Light. లైట్ మూమెంట్స్ చేసేను స్ట్రాంగ్ టీమ్” అనే బ్రాండ్ సందేశ సారాంశాన్ని టీవీసీ అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. సరదా క్షణాలను పంచుకోవడం ప్రియమైన వారి మధ్య బంధాన్ని ఎలా బలపరచగలదనేది తెలియజేస్తుంది. తద్వారా చిరకాలం గుర్తుండిపోయే అనుభూతుల్లో Sunfeast Marie Lightని కూడా అంతర్గత భాగంగా చేస్తుంది. టీ మరియు కాఫీ బ్రేక్‌లకు సరైన నేస్తంగా ఉండే, కరకరలాడే మరియు రుచికరమైన బిస్కెట్ల శ్రేణితో Sunfeast Marie Light పునరావిష్కరణ, ప్రియమైన జ్ఞాపకాలను ప్రజ్వలింపజేయడంతో పాటు కొత్తగా మరిన్ని చిరస్మరణీయ జ్ఞాపకాలను అందించే హామీ ఇస్తోంది. టెలివిజన్, డిజిటల్ మరియు ప్రింట్‌తో పాటు ఈ ప్రచార కార్యక్రమం వివిధ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వ్యాప్తంగా ఆవిష్కరించబడుతుంది. రిటైల్ అవుట్‌లెట్లలోని బహుళ SKUలు మరియు వివిధ మార్కెట్ల వ్యాప్తంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ప్రోడక్ట్ లభిస్తుంది.