
మండలంలోని పెద్ద మల్లారెడ్డి, భిక్కనూర్ ఆయా గ్రామాలలో వరి పంట పొలాలను ఏ డి ఏ అపర్ణ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వరి పంటకు మందులు వాడాలని, చీడపురుగుల నివారణ కొరకు ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు సలహాలు తీసుకోవాలని రైతులకు తెలిపారు. ఈ పరిశీలనలో వ్యవసాయ అధికారి రాధా, ఏఈవోలు, రైతులు, తదితరులు ఉన్నారు.