రైతు నేస్తం ను సద్వినియోగం చేసుకోండి: ఏడిఏ వీరస్వామి

నవతెలంగాణ – నసురుల్లాబాద్
రైతు నేస్తం పథకం ను కార్య‌క్ర‌మాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు క‌లిసి బాన్సువాడ నియోజకవర్గ స్థాయి వ్యవసాయ విస్తీర్ణ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం బుధవారం నస్రుల్లాబాద్ మండలంలోని రైతు వేదిక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ విస్తీర్ణాధికారులు రైతులు స్థానిక నేతలతో ముఖాముఖి చర్చ వేదిక కొనసాగింది. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గం వ్యవసాయ సాగుపై మంత్రి బట్టి విక్రమార్క గార్లకుఅడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాన్సువాడ వ్యవసాయ అధికారి వీరస్వామి మాట్లాడుతూ..రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అను సంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం. దశలవారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను స్థాపించ‌నున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్‌ ఫ్లాట్‌ ఫారం. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు నిర్వ‌హించ‌నున్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్‌లైన్‌లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వ‌నున్నారు. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవ‌చ్చు. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ప్ర‌భుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నసురుల్లాబాద్ బీర్కూర్ గ్రామాలకు చెందిన వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రైతులు స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.