– చర్యలు తీసుకోవాలని ప్రజల వేడుకోలు పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
పెద్దకొడప్ గల్ మండలంలోని కొన్ని గ్రామ పంచాయితీ పరిధిలో కంపోసిట్లు మందుబాబులకు అడ్డాగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో లక్షలు రూపాయల వ్యయంతో కంపోస్ట్ ల నిర్మాణం చేపట్టినప్పటికీ అవి కొన్ని గ్రామాలలో ఉపయోగంలోలేక నిరుపయోగంగా మారాయి. గ్రామాలలో గ్రామపంచాయతీ ట్రాక్టర్ సేకరించిన సేకరించిన తడి చెత్త పొడి చెత్తను కంపోస్ట్ షెడ్యూల్లో వేరుచేసి ఎరువుగా తయారు చేసి కేంద్రంగా కంపోసిట్లను ప్రభుత్వం నిర్మించింది కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల పలు గ్రామాలలో బేగంపూర్,అంజని, సముందర్ తాండ, లింగంపల్లి విట్టల్వాడి,విట్టల్వాడితండాలలో నిరుపయోగంగామారాయని విమర్శలు వెల్లువెత్తుతున్న సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం రైతులకు ఎరువులను సరఫరా చేయాలనే లక్ష్యం నీరు కారిపోతుంది. రైతులకు ఎరువులు సరఫరా చేయాలని మంచి ఉద్దేశంతో కంపోస్ట్లు ఏర్పాటు చేసినప్పటికీ ఎలాంటి ఎరువులు తయారీ ప్రక్రియ జరగడం లేదని విమర్శలు ఉన్నాయి ఉపయోగం లేక నిరుపయోగంగా ఉండడంతో మందుబాబులు అడ్డాగా మార్చుకున్నారు గ్రామాలలో పుట్టగొడుగుల్లా వెలిసిన బెల్ట్ షాపుల వెలవడంతో గ్రామాల్లో ఉండే కొంతమంది కంపోసిట్లను అడ్డాగా మార్చుకున్నారు. మందుబాబులు ప్రతిరోజు మద్యం సేవించి కంపోస్ట్లలో ఖాళీ సీసాలు వదిలి వెళ్తున్నారు మద్యం సేకరించి హంగామా చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు. లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన కంపోస్ట్ లు నిరుపయోగంగా లేకపోవడం దానికి ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేసిందని పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవచూపి లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన కంపోస్ట్లలో సేంద్రియ ఎరువులు తయారయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రతి గ్రామంలో ట్రాక్టర్ ద్వారా తడి చెత్తను పొడి చెత్తను స్వీకరించాలని ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.