న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో అదానీ ఎంటర్ప్రైజెస్ నికర లాభాలు 664 శాతం పెరిగి రూ.1,742 కోట్లకు ఎగిశాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.228 కోట్ల లాభాలు ప్రకటించింది. అదే సమయంలో రూ.19,546 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ2లో 16 శాతం పెరిగి రూ.22,608 కోట్లకు చేరింది. మంగళవారం జరిగిన కంపెనీ బోర్డు మీటింగ్‌లో రూ.2,000 కోట్ల నిధుల సమీకరణ కోసం గాను నాన్ కన్వర్టేబుల్ డిబెంచర్లు (ఎన్సిడి)లు జారీ చేయాలని నిర్ణయించింది.