గీన్‌ ఎనర్జీలో అదాని రూ.9,350 కోట్ల పెట్టుబడులు

ముంబయి : అదానీ గ్రీన్‌ ఎనర్జీ (ఏజీఎల్‌)లో అదాని గ్రూపు రూ.9,350 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇందుకోసం డిసెంబర్‌ 26న ప్రమోటర్లకు ఒక్కో షేరు ధర రూ.1,480.75 చొప్పున రూ.9,350 కోట్ల విలువ చేసే ప్రిఫరెన్షియల్‌ వారెంట్ల జారీకి ఎజిఎల్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నిధులను డెలివరేజింగ్‌, వేగవంతమైన మూలధన వ్యయం కోసం ఉపయోగించబడతాయని పేర్కొంది. 2030 నాటికి 45 గిగావాట్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రకటనతో మంగళవారం బిఎస్‌ఇలో అదాని గ్రీన్‌ ఎనర్జీ షేర్‌ 5 శాతం పెరిగి రూ.1,617 వద్ద ముగిసింది.