అదానీ ముడుపులపై దర్యాప్తు చేపట్టాలి

– కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఈఏఎస్‌ శర్మ లేఖ
విశాఖపట్నం : సెకీ నుంచి విద్యుత్తు ఒప్పందాలు చేసుకునేందుకు గౌతమ్‌ అదానీ భారీ ముడుపులు చెల్లించడంపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి మంత్రి నిర్మలా సీతారామన్‌కు భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ లేఖ రాశారు. అదానీపై అమెరికా కోర్టు కేసు నమోదు కేంద్ర ప్రభుత్వం, సెబీ సహా ఇతర ప్రభుత్వ సంస్థల వైఫల్యాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. భారత వ్యాపారవేత్త అదానీ, ఆయన మేనల్లుడు సాగర్‌తోపాటు మరో ఆరుగురిపై మోసం, లంచం ఆరోపణలపై అమెరికా కోర్టులో కేసు నమోదైన నేపథ్యంలో శనివారం రాసిన లేఖలో లేవనెత్తిన అంశాలు ఇలా ఉన్నాయి. ‘అమెరికా డిస్ట్రిక్ట్‌ కోర్టు, ఎస్‌ఈసీ రెండూ కూడా అమెరికాలో న్యాయవ్యవస్థకు చెందినవి కావడం, రెండోది సెబీ భారత్‌లో అత్యుత్తమ సంస్థ కావడంతో మీరు, మీ సహౌద్యోగులు ఎప్పటిలానే వారి అభియో గాలు, నేరారోపణలను పక్కన పెట్టలేరు. అమెరికా, భారత్‌లో ఎఫ్‌బీఐ నిష్పక్షపాతంతో దర్యాప్తు చేపట్టాలి. అదానీపై అభియోగాలను తిరస్కరించం, రక్షించడంతో మీ శాఖ దేశీయ పెట్టుబడిదారుల, ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడమే కాకుండా మీ శాఖ వివరించలేని నిశ్చలత స్థితికి పడిపోయింది. అదానీ అంశం కేంద్ర, రాష్ట్ర సంస్థల విచ్ఛిన్నంపై తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతోంది. ఇది దేశ ప్రజలను మోసగించడం, మిలియన్ల మంది విద్యుత్‌ వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీయడమే.