సమస్యలపై మంత్రికి అడవీ శ్రీరాంపూర్‌ ఎంపిటిసి వినతి

నవతెలంగాణా-ముత్తారం
ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్‌ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర సచివాలయంలో ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును అడవీ శ్రీరాంపూర్‌ ఎంపిటిసి దొడ్డ గీతారాణి బాలాజీ గురువారం కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అడవి శ్రీరాంపూర్‌ గ్రామానికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వచ్చే నీళ్లను కెనాల్‌ పూర్తి చేసి కొత్త మాటు ద్వారా గ్రామంలోని అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలని కోరారు. అడవీ శ్రీరాంపూర్‌లో గల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరిన సందర్భంగా మొత్తం గదులను తొలగించి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నూతన భవనం నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.