హావ్‌ మోర్‌ మరిన్ని కొత్త రుచుల జోడింపు

హైదరాబాద్‌: లోట్టెకు చెందిన ప్రముఖ ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ హావ్‌ మోర్‌ కొత్తగా వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా 10 సరికొత్త రుచులతో సమ్మిళితమైన ఐస్‌క్రీమ్‌లను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. వినియోగదారుల మారుతున్న అభిరుచికి అనుగుణంగా వీటిని ఆవిష్కరించామని ఆ సంస్థ తెలిపింది. సంప్రదాయ ఐస్‌ క్రీం రుచులను అందిస్తూనే.. హావ్‌ మోర్‌ రాజ్‌వాడి కుల్ఫీ ఫలూదాతో ఆకర్షణీయమైన అనుభవాన్ని సృష్టిస్తుందని హవ్‌మోర్‌ ఐస్‌ క్రీమ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, మార్కెటింగ్‌ రిషబ్‌ వర్మ పేర్కొన్నారు.