మండల సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆవేదన
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండల 17 గ్రామ పంచాయతీల పరిధిలో విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వినియోగదారులపై అధిక భారం పడుతుందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రజినీ కిషోర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. విద్యుత్తు శాఖ సిబ్బంది ప్రతినెల ఒకటో తారీఖున రీడింగ్ తీయాల్సి ఉండగా, పదవ తారీకు వరకు రీడింగ్ తీస్తూ ఉండడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం త్వరలో 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందేనని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. రెంజల్ మండలంలో మండల విద్యాశాఖ అధికారి లేకపోవడంతో అనేక సమస్య ఏర్పడుతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి మండల విద్యాశాఖ అధికారి పోస్టును భర్తీ చేయాలని, సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఉన్నత అధికారులకు పంపనున్నట్లు వారు పేర్కొన్నారు. మండలంలో12 ఆయా పోస్టులు, 2 అంగన్వాడి టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ నెలాఖరులోపు వాటిని భర్తీ చేయనున్నట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీలారాణి తెలిపారు. ఏసంగి సీజన్లో 6 విడతలుగా సాగునీటిని అందించనున్నట్లు ఏఈఈ బుజేందర్ పేర్కొన్నారు. నీటిని వృధా చేయకుండా మిగిలిన నీటిని చెరువుల్లోకి నింపుకోవాలని ఆయన సూచించారు. మాటు కాలువ నుంచి నీల వరకు సిసి పనులకు నిధులు మంజూరు కాగా అర్ధాంతరంగా వదిలివేశారని ఆప్షన్ సభ్యులు అంతయ్య సభ దృష్టికి తీసుకురాగా, కాంట్రాక్టర్ బ్రోకెన్ తో పనులు జరిపి అలాగే వదిలేశారని ఆరోపించారు. కందకుర్తి ఎత్తిపోతల పథకం అర్ధాంతరంగా నిలిచిపోయిందని, ట్రాన్స్ ఫార్మర్లు చెడిపోవడం వల్ల రైతులకు సాగునీరు అందడం లేదని, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫారం నమోదు చేయించాలని సభ్యులు కోరారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని సాటాపూర్ సర్పంచ్ వికార్ పాష, ఐకెపి కార్యాలయంలో డ్వాక్రా గ్రూపులకు జరిగిన ఒక తలపై సమగ్ర విచారణ జరిపించాలని రెంజల్ గ్రామ సర్పంచ్ ఎమ్మెస్ రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. నిజాంబాద్ డిపోకు చెందిన బస్సులను సమయానుకూలంగా నడిపించాలని, ముఖ్యంగా విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మేక విజయ సంతోష్, మండల ఉపాధ్యక్షులు ఖ్యాతం యోగేష్, తాసిల్దార్ రామచందర్, ఎంపీడీవో శంకర్, ఎంపీఓ గౌస్ ఉద్దీన్, ఆర్డబ్ల్యూఎస్సీ గబ్బర్ సింగ్, ట్రాన్స్కో ఏఈ రాజలింగం, ఏవో లక్ష్మి కాంత్ రెడ్డి, పి ఆర్ ఏ ఈ వినయ్ కుమార్, నీటిపారుదల శాఖ ఏఈ బుజేందర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి, డాక్టర్ వినయ్ కుమార్, ఎన్జీవో రజిత, ఎంపీటీసీలు లక్ష్మి, రుక్మిణి, అసాద్ బేగ్, సంయుక్త, సర్పంచులు ఎమ్మెస్ రమేష్ కుమార్, మీర్జాకలిమ్ బేగ్, వికార్ పాషా, శనిగరం సాయి రెడ్డి, బైండ్ల రాజు, జాదవ్ గణేష్ నాయక్, పాముల సాయిలు,దూపల్లి సొసైటీ చైర్మన్ భూమారెడ్డి ముళ్ళపూడి శ్రీదేవి, జాదవ్ సునీత, వెలుమల సునీత, మధుర భాయ్, మలావత్ జమున, కాశం నిరంజనీ, పార్ధవాని, హలీమా, రోడ్డ విజయ, తదితరులు పాల్గొన్నారు.