
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటులో నూతనంగా వచ్చిన అదనపు డీసీపీ(లా అండ్ ఆర్డర్) ఎస్. జయ్ రామ్ పోలీస్ కార్యలయంలో భాద్యతలు గురువారం స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా వచ్చిన అధికారిని పోలీస్ అధికారులు పుష్పగుచ్చాలు ఇచ్చి మర్యాదపూర్వకంగా కలువడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ అదనపు డి.సి.పి (లా అండ్ ఆర్డర్) గా వచ్చినందుకు శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రత్యేకంగా కృషి చేస్తానని అలాగే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమావేశాలు సైతం ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.