
జనవరి 26 న భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించబడే భారత గణతంత్ర దినోత్సవం వేడుకల ఏర్పాట్లను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏ భాస్కరరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి అమరేందర్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ నాగిరెడ్డి, తాహసీల్దార్ అంజిరెడ్డి, జిల్లా యువజన అధికారి ధనుంజయ్, అధికారులు ఉన్నారు.