స్ట్రాంగ్ రూములను పరిశీలించిన అదనపు కలెక్టర్ అంకిత్

నవతెలంగాణ – భీంగల్
పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మండల పరిషత్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల  ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూములను అదనపు కలెక్టర్ అంకిత్ శనివారం  మండల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈవీఎం భద్రపరిచే గదులలో విద్యుత్ సక్రమంగా ఉండే విధంగా చూడాలని అధికారులకు ఆదేశించారు.  స్ట్రాంగ్ రూములకు 100 మీటర్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయాన్ని పరిశీలించి ఎంపీడీవో సంతోష్ కుమార్ అన్న పళ్ళు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట ఎంపీడీవో సంతోష్ కుమార్. తాసిల్దార్ శ్రీలత. జీజేసి ప్రిన్సిపాల్ డాక్టర్ చిరంజీవి,  ఎంపీ ఓ గంగ మోహన్ తదితరులు ఉన్నారు.