
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ మున్సిపాలిటీ పాతబస్తీ లో గల హిందూపూర్ వాటర్ ట్యాంక్ లో శవం సంఘటనపై జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి స్పందించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్రను విచారణ అధికారిగా నియమించారు.సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.