ప్రజా పాలన కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

నవతెలంగాణ కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో  ప్రజా పాలన కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా పాలన కేంద్రాల పనితీరు, కంప్యూటర్ ఆపరేటర్ల పనితీరును ఆయన పరిశీలించారు. లబ్ధిదారుల నుండి వచ్చిన దరఖాస్తులను ఆన్ లైన్ చేస్తున్న  తీరును ఆయన కంప్యూటర్ ఆపరేటర్లను అడిగి తెలుసుకున్నారు.ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా అర్హులైన లబ్ధిదారులు అందించే దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ చేయాలని కంప్యూటర్ ఆపరేటర్లకు సూచించారు. ప్రజా పాలన కేంద్రం నిర్వహణ  పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కంప్యూటర్ ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.