ఫిర్యాదుల వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించిన అదనపు కలెక్టర్‌

నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్‌
మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల సంక్షేమ శాఖ నల్లగొండ వారి ఆధ్వర్యంలో వయో వృద్దుల పోషణ ఫిర్యాదుల వెబ్‌ పోర్టల్‌ను జిల్లా అదనపు కలెక్టర్‌ ఖుష్భుగుప్తా గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆ విష్కరించారు. పి ల్లల ని రాధారణకు గురైన త ల్లిదండ్రులు తమ పిల్లలపై ఫి ర్యాదులను ఉంటే tsseniorcitizens.cgg.gov.inవెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వయో వృద్దులు మొబైల్‌ ఫోన్‌ ద్వారా గాని, ఆన్‌లైన్‌ సేవా కేంద్రాలు అయిన మీ సేవ కేంద్రల ద్వారా, లేదా వారి ఇంటి నుండే నేరుగా ఈ వెబ్‌ పోర్టల్‌ లో ఫిర్యాదులు నమోదు చేయవొచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్ల పరిదిలోని అన్నీ దరఖాస్తులను ఇక నుండి ఆన్లైన్‌ లో దరఖాస్తు చేయాలని గతంలో ఇచ్చిన దరఖాస్తులను కూడా ఆన్లైన్‌ చేయాలి అని ఆదేశించారు. ఎవరైనా ఇట్టి విషయములో ఫిర్యాదు చేసే విధానములో సమస్యలు ఉంటే హెల్ప్‌ లైన్‌ నెం.14567 ని సంప్రదించాలని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ దివ్యాంగుల, వయో వృద్దుల సంక్షేమ శాఖ వారు రూపొందించిన గోడ ప్రతులను ఆవిష్కరించి అనంతరం ఆపదలో ఉన్న వయోవృద్ధుల కోసం కోసం రెస్క్యూ వాహనము (చేయూత వెహికిల్‌)ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కేవీ.కృష్ణవేణి, క్షేత్ర భాధ్యత అధికారి ఎం.నాగిరెడ్డి, కార్యాలయ సిబ్బంది జి.శ్రీహరి, జె.వెంకట్‌ రెడ్డి, వయో వృద్దుల సంక్షేమ సంఘం జిల్లా సభ్యులు ఎస్‌.మల్లిఖార్జున్‌, సుధర్శన్‌ రెడ్డి, బి.శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.