నవతెలంగాణ-మల్హర్ రావు/మహాముత్తారం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా,రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు తదితర పథకాలను అర్హులైన పేదలకు ఎంపిక చేయాలనే ఆదేశాల మేరకు గురువారం మహాముత్తారం మండలంలోని బోర్లగూడెం గ్రామంలో గ్రామసభ నిర్వహించారు.ఈ సభను భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ రైతు భరోసా, రేషన్ కార్డుల విచారణ క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు.ఈ సందర్బంగా రేషన్ కార్డుల పరిశీలన, రైతు బరోసా పథకం అమలును మహముత్తారం మండల తహసీల్దార్ కార్యాలయంలో పలు కార్యాచరణల అమలుపై సమీక్ష నిర్వహించారు.ఈ పరిశీలనలో పథకాల అమలు విధానం, లబ్ధిదారుల సమస్యలు,అధికారుల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించి, తగిన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్ తదితరులు పాల్గొన్నారు.