పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మాల్ కాపీయింగ్ సాగుతున్నందున “ఇంటర్ పరీక్షలో అంతా చూచి రాతే..?” “నవతెలంగాణ” దినపత్రికలో కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.  స్పందించిన జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ మంగళవారం పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాల్ ప్రాక్టీస్ జరగకుండా పగడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థులకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని చీఫ్ సూపర్డెంట్ శ్రీనివాస్ కు ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని, రికార్డులను పరిశీలించారు. ఈ పరిశీలనలో జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం, పరీక్షా విభాగం అధికారులు ఉన్నారు.