నవతెలంగాణ – భీంగల్
ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అదనప కలెక్టర్ అంకిత్ సూచించారు. శుక్రవారం మండలంలోని కుక్కలు గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పనులను మండల అధికారులతో కలిసి పరిశీలించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అమ్మ ఆదర్శ పనులను పూర్తిచేసి పాఠశాలలను విద్యార్థులకు సౌలభ్యంగా ఉంచాలని కాంట్రాక్టర్లకు సూచించారు. పాఠశాలల్లో కొనసాగుతున్న పనులు నాణ్యమైనవిగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ కు సూచించారు. అదనపు కలెక్టర్ వెంటా ఎంపీడీవో సంతోష్ కుమార్, ఏపీవో నరసయ్య, ఏ ఈ మేఘన తదితరులు ఉన్నారు.