పకడ్బందీగా సర్వేలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ శ్రీనివాసులు రెడ్డి

Armored surveys to be conducted: Additional Collector Srinivasulu Reddyనవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 జనవరి నుండి అమలు చేసే నాలుగు పథకాలపై జరుగుతున్న అధికారుల సర్వేలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సర్వే కార్యక్రమాల్లో భాగంగా మద్నూర్ మండలంలోని లచ్చన్ అంతాపూర్ గ్రామాలను పర్యటించి అధికారుల సర్వేలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ మండల ప్రత్యేక అధికారి నాగరాజ్ ఎంపీడీవో రాణి మండల వ్యవసాయ అధికారి రాజు ఆయా గ్రామాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.